NTV Telugu Site icon

Janhvi Kapoor: మధురానగర్‌ హనుమాన్‌ గుడిలో జాన్వీకపూర్ పూజలు

Janvikapoor

Janvikapoor

బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈరోజు హైదరాబాద్‌ మధురానగర్‌లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. గురువారం ఉదయం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు జాన్వీ కపూర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. మరోవైపు జాన్వీకపూర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌తో సెల్ఫీలు దిగేందుకు వారంతా పోటీ పడ్డారు.

Truecaller: ట్రూకాలర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?

అయితే తల్లిలాగే జాన్వీకపూర్‌కి కూడా దైవభక్తి ఎక్కువ. ఆమె వీలు కుదుర్చుకుని మరీ తిరుమల వేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటారు. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కాదు సినిమా విడుదల, కొత్త సినిమా ప్రారంభం సందర్భంగా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది.. అలాంటి ఆమె హైదరాబాద్‌లోని మధురానగర్‌ – వెంగళరావు నగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడే అరగంటకుపైగా పూజలు నిర్వహించారు.

Show comments