Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డే్ట్స్ అయిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ సినిమా రెండు పార్ట్స్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జాన్వీ కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్లో “Lights on. Dreams rolling. Day 1 of something massive” అంటూ ఒక ఫొటోను పంచుకోవడంతో, అది ‘రాకా’ షూటింగ్‌కు సంబంధించినదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారం నిజమైతే ఇప్పటికే సినిమాలో భాగమైనట్లు వార్తలు వస్తున్న దీపికా పదుకొణెతో పాటు జాన్వీ కపూర్ కూడా నటించనున్నట్లు అవుతుంది. దీంతో అట్లీ – అల్లు అర్జున్ – దీపికా పదుకొణె – జాన్వీ కపూర్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, జాన్వీ కపూర్ ‘రాకా’లో నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.