NTV Telugu Site icon

Janhvi Kapoor : ఆ ప్రమాధం నా జీవితంలో మర్చిపోను..

Janvi

Janvi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.  తన నటన అందంతో వరుస అవకాశాలు అందుకుని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన తల్లిని మరిపిస్తూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రజంట్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో చెతినిండ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన వడోదర రోడ్డు ప్రమాదంపై జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యారు.

Also Read: Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..

గుజరాత్‌లోని వడోదరలోని నాగరిక కరేలి బాగ్ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు, షేర్ ఆటో పైకి దూసుకెళ్లింది. అందులో ఒక మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ పైనే జాన్వీ కపూర్ స్పందించింది.. ‘వేదనకరమైన, భయానకమైన వార్త ఇది, దాని గురించి ఆలోచించగానే నా కడుపు తరుక్కుపోతుంది. వారి అజగ్రత కారణంగా నిండు ప్రాణం బలైంది’ అని భావోద్వేగంగా రాసుకొచ్చింది జాన్వీ.