Site icon NTV Telugu

Janhvi Kapoor : వారం గ్యాప్ లో రెండు సినిమాలను దించుతున్న జాన్వీ

Janhvi

Janhvi

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మెరుపులు చూపించలేకపోతుంది. ఫస్ట్ ఎంటప్ట్‌లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్. ఇషాన్- జానూ జంటగా నటించిన దడక్ వంద కోట్లను వసూలు చేసింది. కానీ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది దడక్ రేంజ్ హిట్ మళ్ళి రాలేదు. సగం సినిమాలు ఓటీటీకే పరిమితం కావడం కూడా ఆమెకు మైనస్‌గా మారాయి. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏడేళ్లు దాటి పోయింది. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం సెవెన్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న జానూకు మరో ఝలక్ ఇచ్చింది పరమ్ సుందరి. కాంట్రవర్సీనో లేక సినిమా ఎక్కలేదో ఆడియన్స్ తిప్పికొట్టారు.

Also Read : Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ రిలీజ్ డేట్ ఫిక్స్..

అయిన సరే పట్టువదలకుండా ట్రై చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్‌ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తోంది జాన్వీ కపూర్. వారం గ్యాప్‌లో టూ ఫిల్మ్స్ దించేస్తోంది. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హౌంబౌండ్ సడెన్లీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో దడక్ హీరో ఇషాన్ ఖత్తర్‌తో మరోసారి జోడీ కడుతోంది జానూ. వరుణ్ ధావన్, జానీ నటిస్తోన్న ఫిల్మ్ సన్నీ సంస్కారీ తులసి కుమారీ అక్టోబర్ 2న రాబోతుంది. ఈ ఇద్దరు బవాల్ అనే ఫిల్మ్ చేయగా అదీ ఓటీటీకే పరిమితమైంది. తెలుగులో భారీ హిట్ కొట్టి పెద్దికి ఛాన్స్ దక్కించుకున్న జానూకి. ఇప్పుడు బాలీవుడ్ ముంగిట్లో ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే ఈ రెండు తప్ప మరో బాలీవుడ్ ఆఫర్ లేదు. మరి జానూ ఖత్తర్‌తో కలిసి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో.

Exit mobile version