NTV Telugu Site icon

Jai Hanuman First Look: ‘జై హనుమాన్’ వస్తున్నాడు!

Jai Hanuman

Jai Hanuman

తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులు ఎవరికి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన హనుమాన్ సినిమా అత్యద్భుతమైన హిట్ కావడమే కాదు షాకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఈరోజు ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి నిర్మాతగా చేసిన ప్రశాంత్ వర్మ రెండో సినిమా మాత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోతున్నారు.

Allu Arjun: బాలయ్య ముందు నంద్యాల విషయంపై బన్నీ కామెంట్స్

ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మ సినిమాకి యూనివర్స్ లో భాగం కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకు అంతకు పెరుగుతున్నాయి. ఇక ప్రీ లుక్ కనుక చూస్తే హనుమంతుడు ఒక పురాతన దేవాలయం వైపు నడుస్తున్నట్లుగా ఉండడం ఆసక్తి రేపటిస్తోంది. ఇక దీపావళి సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము అని ప్రకటించడంతో అది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడుతోంది. ఇక ఈ సినిమాలో నటించబోయే ప్రధానమైన నటుడు ఎవరు అనే విషయం మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం మీద అనేక ఊహాగానాలు కూడా ఉన్నాయి. నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్న ఈ సినిమా మీద అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.

Show comments