NTV Telugu Site icon

Jai Hanuman: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. బాక్స్ ఆఫీస్ ఊపిరిపీల్చుకోవాలమ్మా !

Jai Hanuman

Jai Hanuman

ఎప్పుడా ఎప్పుడా అని యావత్ హనుమాన్ సినిమా లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జై హనుమాన్ సినిమా అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రశాంత్ వర్మ 5:49 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆంజనేయస్వామి లుక్ లో రాముడు విగ్రహాన్ని హత్తుకుని ఉన్న ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని షేర్ చేశారు జై హనుమాన్ సినిమా మేకర్స్.

Kejriwal: ఆయుష్మాన్ భారత్‌పై కేజ్రీవాల్ విమర్శలు

ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దానికి సీక్వెల్ గానే ఈ జై హనుమాన్ సినిమా అనౌన్స్ చేశారు. అయితే 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేసుకున్న ఇప్పటివరకు అందుకు తగ్గ ప్రయత్నాలు అయితే లేవు. ఈ దీపావళిని హనుమాన్ చాలీసాతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిషబ్ శెట్టి ఆంజనేయుడుగా కరెక్ట్ గా సెట్ అయ్యాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments