Destiny : హీరోగా జబర్దస్త్ ఇమాన్యుయేల్ సెన్సేషన్.. ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి బ్యాకింగ్!

Destiny

Destiny

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ ఇమాన్యుయేల్ ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై లీడ్ రోల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ‘డెస్టినీ’ చిత్రంతో మెయిన్ రోల్ ప్లే చేస్తూ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే, ఇమాన్యుయేల్ తొలి ప్రయత్నానికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి లాంటి బడా దర్శకుడి బ్యాకింగ్ దొరకడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను అనిల్ రావిపూడి చేతుల మీదుగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటను విడుదల చేసిన అనిల్ రావిపూడి.. సినిమా కాన్సెప్ట్ విన్నానని, కథ చాలా అద్భుతంగా ఉందని కితాబివ్వడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇమాన్యుయేల్ తనకు చాలా క్లోజ్ అని, ఈ సినిమాతో అతను భారీ హిట్ కొట్టడం ఖాయమని అనిల్ ఆకాంక్షించారు.
ఇక మారుతి రాజా అందించిన క్యాచీ ట్యూన్‌కి శ్రీరామ్ తపస్వి రాసిన సాహిత్యం యూత్‌ను భలేగా ఎట్రాక్ట్ చేస్తోంది. దానికి తోడు చంద్రకిరణ్ మాస్టర్ కంపోజ్ చేసిన సింపుల్ అండ్ స్టైలిష్ స్టెప్పులు చూస్తుంటే.. త్వరలోనే ఈ పాట ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను షేక్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. శ్రీ సత్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని, కిరీటి, రవి ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఫస్ట్ లుక్‌కు డైరెక్టర్ నందినీ రెడ్డి, ఇప్పుడు సాంగ్‌కు అనిల్ రావిపూడి సపోర్ట్ దొరకడంతో.. స్టార్టింగ్ లోనే ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ టీమ్ భలే క్రేజ్ సంపాదించుకుంది.