‘ఆదిపురుష్’ లో లంకేశ్ పని అయిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో హైదరాబాద్ లోనూ షూటింగ్ చేశాడు. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని లంకేశ్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. ‘ఒకరు దుస్తులు వేస్తుంటారు, మరొకరు మేకప్ చేస్తుంటారు. శరీరానికి అన్ని తరహాల్లో అలంకరణ చేశాక ఓ మాసం ముక్కలా మమ్మల్ని కెమెరా ముందు నిలబెట్టేవారు’ అని సరదాగా చెప్పుకొచ్చాడు.
Read Also : ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఇంతకూ విషయం ఏమంటే… హిందీలో సినిమాలను యేళ్ళ తరబడి తీస్తారనే అపప్రధ ఒకటి ఉంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ దర్శకుడు ఓం రౌత్ ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన ‘ఆదిపురుష్’ షూటింగ్ ను చకచకా సాగిస్తున్నాడు. అంతేకాదు… లంకేశ్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పోర్షన్ ను పూర్తి చేసి, అతనికి వీడ్కోలు కూడా పలికేశాడు. ఇదే విషయాన్ని నిన్న మూవీ కస్ట్యూమ్ డిజైనర్ నచికేత్ బార్వే తెలిపారు. షూటింగ్ సమయంలో సైఫ్ ఎంతో సహకరించారని, ఆయనతో వర్క్ చేయడం ఆనందాన్ని కలిగించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక సైఫ్ అలీఖాన్ కు వీడ్కోలు పలుకుతూ, సెట్ లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్ చేశారు. సైఫ్ తో షూటింగ్ ఎంతో వినోదాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘ఆదిపురుష్’ కోసం వర్క్ చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని సైఫ్ సైతం పేర్కొన్నాడు. మరి మిగిలిన నటీనటుల షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!