ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్

దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు.

Read Also : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్

హరీష్ మాట్లాడుతూ “మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి. సంవత్సరంన్నర నుంచి మనందరికీ పాండమిక్ సిట్యుయేషన్ ఉంది. కానీ ఒక్క పర్సన్ కు మాత్రం పాండమిక్ లేదు, లాక్ డౌన్ లేదు. ఆమె పని చేస్తూనే ఉంది. ప్రపంచంలో ఆమెకు మాత్రమీ పాండమిక్, లాక్ డౌన్ కరోనా ఏదీ లేదు. సాధారణంగా మనం హీరోయిన్ల డేట్స్ సినిమా షూటింగుల కోసం తీసుకుంటాము. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఫోన్ కాల్ కు కూడా డేట్స్ తీసుకోవాల్సి వస్తుంది. షి ఈజ్ ఆపోజిట్ టు అఖిల్, షి ఈజ్ ఆపోజిట్ టు పవన్, షి ఈజ్ ఆపోజిట్ టు బన్నీ, షి ఈజ్ ఆపోజిట్ టు ప్రభాస్, షి ఈజ్ ఆపోజిట్ టు మహేష్… బట్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ది డైరెక్టర్స్. పూజా చాలా సంతోషంగా ఉంది” అంటూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూజాపై ప్రశంసల వర్షం కురిపించారు దర్శకుడు హరిశ శంకర్.

-Advertisement-ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్

Related Articles

Latest Articles