Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు

Nitish Malhotra

Nitish Malhotra

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారుబాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత  ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేతి నమిత్ మల్హోత్రా కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముంబైలోని ఆయన నివాసంతో పాటు సంస్థ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా నమిత్ మల్హోత్రాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్ల ఆఫీసులను కూడా ఐటీ అధికారులు జల్లెడ పట్టారు. ప్రధానంగా విదేశీ నిధుల లావాదేవీలు మరియు ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేందుకే ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఐటీ దాడుల వార్తలు బయటకు రావడంతో నమిత్ మల్హోత్రాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మీడియా కంపెనీ ‘ప్రైమ్ ఫోకస్‘ షేర్ విలువ తీవ్ర ఒత్తిడికి లోనైంది. మార్కెట్ ప్రారంభంలోనే ఈ సంస్థ షేరు ధర దాదాపు 8% వరకు క్షీణించింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ భారీ విజువల్ వండర్ పార్ట్-1 ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న ఘనంగా విడుదల కానుంది.