NTV Telugu Site icon

Jyothika: ఇక్కడ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది..

Jyothika

Jyothika

నటి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషలో దాదాపు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చంద్రముఖి మూవీతో తనలోని ట్యాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి పిల్లలు ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయి ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి భిన్నమైన కథలు ఎంచుకుంటున్న జ్యోతిక విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ మధ్య బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇక రీసెంట్‌గా ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న జ్యోతిక ఈ సీరిస్ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ల కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

జ్యోతిక మాట్లాడుతూ.. ‘ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే నేను వివాహ బంధం లోకి అడుగుపెట్టాను. 28 సంవత్సరాల వయస్సులోనే నేను ఇద్దరు పిల్లలకు తల్లి నయ్యాను. ఆ తర్వాత కూడా భిన్నమైన రోల్స్‌లో నటిస్తూ నేను కెరీర్‌ను కొనసాగించాను. కానీ పెళ్లి తర్వాత ఏ స్టార్ హీరో సరసన కూడా వర్క్ చేసే ఛాన్స్ నాకు రాలేదు. ఇక కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయడం చాలా పెద్ద సవాల్ తో కూడుకుంది. ఆ రోజుల్లో బాలచందర్ వంటి డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు మహిళల కోసం సినిమాలు తీసేవారని ప్రస్తుతం అలా ఎవరూ సినిమాలు తీయడం లేదు. ఇందుకు బడ్జెట్ ఒక కారణం అయితే ఏజ్ మరో కారణమని చెప్పాలి. మహిళల కొరకు గొప్ప కథలు రాసేవారు తగ్గిపోయారు. అందులోను సౌత్‌లో నటిగా కొనసాగడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా పోరాటం చేయాల్సి ఉంటుంది’ అని జ్యోతిక తెలిపింది. ప్రజంట్ ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి.