బాలీవుడ్ లోని కొన్ని పాటలకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కు విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ క్రీడా వేదిక ఒలంపిక్స్ లో ఓ బాలీవుడ్ సాంగ్ విన్పించడం అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. టోక్యోలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇజ్రాయెల్ జట్టు స్విమ్మర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్స్కీ అనే ఇద్దరూ జోడిగా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో పోటీ పడ్డారు. ఈ సమయంలో ఇద్దరూ మాధురి దీక్షిత్ పాట ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఈత కొట్టారు. వారిద్దరికీ సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Also : “బిగ్ బాస్-5″లో ఇతడికే హైయెస్ట్ రెమ్యూనరేషన్?
మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “ఆజా నాచ్లే”. 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. సలీం-సులైమాన్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో సంగీతం ప్రియులను అందరిని మెప్పించిన ఈ సాంగ్ ఇన్నేళ్ల తరువాత ఒలంపిక్స్ క్రీడాకారుల వల్ల మరోసారి వైరల్ అవుతోంది.
