“బిగ్ బాస్-5″లో ఇతడికే హైయెస్ట్ రెమ్యూనరేషన్?

పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం “బిగ్ బాస్ 5” తెలుగు సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ ఐదవ సీజన్ ను వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాబోయే సీజన్‌లో అక్కినేని నాగార్జున స్థానంలో ఇతర తెలుగు స్టార్స్ ను నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి కింగ్ నాగార్జున ఈ రియాలిటీ షోకి హోస్ట్ చేయబోతున్నారని వినికిడి. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” పోటీదారులుగా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణిని పేర్లు విన్పిస్తున్నాయి.

Read Also : అక్షయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “బెల్ బాటమ్”కు పోటీ లేదు

ఇందులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ కొద్దిరోజుల్లో అతనితో ప్రోమోని షూట్ చేయబోతున్నారట. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా “బిగ్ బాస్ 4 తెలుగు” 6 సెప్టెంబర్ 2020న మొదలై, 20 డిసెంబర్ 2020న పూర్తయ్యింది. సీజన్ 4లో అభిజిత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles