Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున హోస్ట్ గా మరికొద్ది రోజుల్లోనే ‘బిగ్ బాస్ 10’ తెలుగు సీజన్‌కు తెరలేవనుండటంతో కంటెస్టెంట్లపై అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈసారి హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు బుల్లితెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ విలన్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ 10లో టాలీవుడ్ విలన్?
‘బిగ్ బాస్ 10’ తెలుగు కంటెస్టెంట్ల జాబితాలో తాజాగా ‘టెంపర్ వంశీ’ పేరు వైరల్ అవుతోంది. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వంశీ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆయన పేరు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్ల జాబితాలో ఉందంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో వంశీ నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నారా? లేక ఇది కేవలం ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్ మాత్రమేనా? అనే ఆసక్తి నెలకొంది.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
‘టెంపర్’తో మంచి గుర్తింపు
టెంపర్ వంశీకి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కనిపించిన వంశీ తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా పలు తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘భరత్ అనే నేను’, ‘అత్తారింటికి దారేది’, ‘భీష్మ’, ‘సాహో’, ‘హిట్ 2’, ‘దేవర’ వంటి సినిమాల్లో కూడా వంశీ కీలక పాత్రల్లో కనిపించారు. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు.
మరి సినిమాలు వదిలి బిగ్ బాస్‌కు వస్తారా?
వంశీ పేరు ‘బిగ్ బాస్ 10’ కంటెస్టెంట్‌గా వినిపిస్తుండటంతో అసలు చర్చ ఆయన షోలోకి వస్తారా లేదా అనే దానిపైనే జరుగుతోంది. ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆయన, కొన్ని నెలల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉండేందుకు అంగీకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి సినీ నటులు, ముఖ్యంగా విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటులు వస్తే షోకు కొత్త రకం కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశీ తన స్క్రీన్‌పై కనిపించే నెగెటివ్ షేడ్స్‌కు పూర్తి భిన్నంగా నిజ జీవితంలో ఎలా ఉంటారనే విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆయన ఎంట్రీ నిజమైతే ఈ సీజన్లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది.
సెప్టెంబర్‌లో బిగ్ బాస్ 10
‘బిగ్ బాస్ 10’ తెలుగు సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది. స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ద్వారా పలువురు సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. మొత్తానికి ‘బిగ్ బాస్ 10’ ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల పేర్లపై భారీ చర్చ జరుగుతోంది. ఇందులో టెంపర్ వంశీ పేరు నిజంగా తుది జాబితాలో ఉందా? ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారా? అనే ప్రశ్నలకు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!