Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఏమైంది.. వరుస వాయిదాలు.. కారణం అదేనా..?

Whatsapp Image 2024 04 18 At 10.06.29 Am

Whatsapp Image 2024 04 18 At 10.06.29 Am

టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఎలాంటి తేడా లేకుండా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు వున్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది .అలాగే దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కూడా మొదలైంది.. దీనితో ఇలాంటి పరిస్థితులలో చిత్రాలను విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని పలు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి..పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయిందని అంత భావించారు..

కానీ చిన్న సినిమాలకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది .అసలే ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం థియేటర్లకి రావడం తగ్గించేశారని అని చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ బాధపడుతుంటే.. ఇప్పుడీ వేసవి సీజన్ లో ఐపీఎల్‌ , సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలవడంతో థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి అస్సలు కనబడటం లేదు .పెద్ద హీరోల సినిమాలు ఎటు వాయిదా పడ్డాయి . ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి

దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న సినిమా “లవ్ మీ “.ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను  శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఐపీఎల్ మరియు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలాగే హీరో నవదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్, మౌళి’. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు . ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా నవదీప్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేసినట్లుగా హీరో నవదీప్ ప్రకటించారు .త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలియజేసారు ..

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “శశివదనే” .. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడ నున్నట్లు తెలుస్తుంది .

Exit mobile version