Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఏమైంది.. వరుస వాయిదాలు.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఎలాంటి తేడా లేకుండా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు వున్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది .అలాగే దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కూడా మొదలైంది.. దీనితో ఇలాంటి పరిస్థితులలో చిత్రాలను విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని పలు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి..పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయిందని అంత భావించారు..
కానీ చిన్న సినిమాలకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది .అసలే ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం థియేటర్లకి రావడం తగ్గించేశారని అని చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ బాధపడుతుంటే.. ఇప్పుడీ వేసవి సీజన్ లో ఐపీఎల్ , సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలవడంతో థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి అస్సలు కనబడటం లేదు .పెద్ద హీరోల సినిమాలు ఎటు వాయిదా పడ్డాయి . ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి
Also Read
దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా వస్తున్న సినిమా “లవ్ మీ “.ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఐపీఎల్ మరియు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే హీరో నవదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్, మౌళి’. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు . ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా నవదీప్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేసినట్లుగా హీరో నవదీప్ ప్రకటించారు .త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలియజేసారు ..
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “శశివదనే” .. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడ నున్నట్లు తెలుస్తుంది .
- Tags
- #post poned
- Movies
- Tollywood
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!