టాలీవుడ్ హీరోలతో కృతిసనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. అది కృతిసనన్ కు టాలీవుడ్ ఉన్న ట్రాక్ రికార్డ్. కానీ ఈ లెక్కలు మళ్లీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. వన్ నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది కానీ ఆ సినిమా మహేష్ బాబు- సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్‌గా మిగిలి పోయింది. ఇక చైతూతో దోచేయ్ అంటూ వచ్చేసినప్పటికీ బాక్సాఫీసును దోచుకోలేకపోయింది ఈ సినిమా.
Also Read : OG : పవన్ కళ్యాణ్ ‘OG’ కోసం మిరాయ్ టీం సంచలన నిర్ణయం..
నేనొక్కడినే, దోచేయ్ దెబ్బలకు బాలీవుడ్ పారిపోయిన కృతి సనన్ అక్కడ హీరోలకు మాత్రం హిట్స్ ఇచ్చి వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్స్ గా మారిపోయింది. కానీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు మన హీరో ప్రభాస్. ఆదిపురుష్‌లో సీతగా కనిపించింది ఈ ఢిల్లీ డాళ్, సినిమా రిజల్ట్ ఫట్. ఓం రౌత్ ఇప్పటికీ ట్రోలింగ్‌కు బలౌతూనే ఉన్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలతో కృతిసనన్ నటించిన ప్రతిసారి ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇలా టాలీవుడ్ హీరోలకు వరుస పరాజయాలు ఇచ్చిన కృతి సనన్‌ను ఇక్కడి మేకర్స్ పక్కన పెట్టేస్తే రిస్క్ చేసేందుకు ట్రై చేస్తున్నాడట సుకుమార్. తాను పరిచయం చేసిన బ్యూటీకి తనే బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా కోసం ఈ బాలీవుడ్ బ్యూటీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. తెలిసి తెలిసి లెక్కల మాస్టారు రిస్క్ చేస్తున్నాడా. లేదా సెంటిమెంట్స్, ఆయింట్ మెంట్స్ పక్కన పెట్టేయబోతున్నాడా. ఇక ధనుష్‌తో తేరే ఇష్క్ మే చేస్తోన్న బ్యూటీ టాలీవుడ్ హీరోలతో డెస్టినీ ఇలా డిజైన్ చేస్తే కోలీవుడ్ హీరోకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో నవంబర్ వరకు వెయిట్ చేద్దాం.
