Site icon NTV Telugu

Retro : రెట్రో బ్రేక్ ఈవెన్.. సాధ్యమయ్యే పనేనా.?

Retro6

Retro6

హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. సుమారుగా 12 ఏళ్ళ నుండి ఆయన సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తమిళ డైరెక్టర్స్ ఎవరూ సూర్యకు సరైన విజయం అందివ్వలేకపోతున్నారు.గత ఏడాది ‘కంగువా’చిత్రం తో ఆయన ఏ రేంజ్ ఫ్లాప్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ తో చేసిన ‘రెట్రో’విజయం సాధిస్తుంది అనుకుంటే,’కంగువా’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టేలా ఉంది.

Also Read : Producers : ఆ విలక్షణ నటుడి కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

తెలుగులో ఈసినిమా రైట్స్ ను పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే మొదటి రోజు కోటి 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, రెండవ రోజు కేవలం 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలా రెండు రోజుల్లో కోటి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మరో 8 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ కోసం రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 82 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, రూ. 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అది కూడా 90శాతం తమిళంలోనే. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా రూ. 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ఈ సోమవారం నుంచి లాంగ్ రన్ పెద్దగా ఉండకపోవచ్చు.వీకెండ్ లో రూ. 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, అంటే పది కోట్ల షేర్ రీకవర్ అవ్వొచ్చనుకున్నారు.అది పాజిబుల్ కాలేదు.

Exit mobile version