Site icon NTV Telugu

96 Movie : 96 సీక్వెల్ ఇక లేనట్లేనా..?

96

96

కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ  సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా నుండి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఎనౌన్స్ మెంట్‌తోనే ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ సడెన్లీ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతితో క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల 96 సీక్వెల్ ఆగినట్లు కోలీవుడ్ టాక్. అలాగే విక్రమ్ 64ని కూడా డీల్ చేస్తున్నాడని వార్తలు రాగా సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత టైం పడుతుందని రీసెంట్లీ చెప్పాడు దర్శకుడు. కానీ నెక్ట్స్ త్రీ ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాలే చేస్తున్నాడు ప్రేమ్. ఇప్పటి వరకు తాను టచ్ చేయని కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు. తమిళ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో ఫహాద్ ఫజిల్‌తో యాక్షన్ థ్రిల్లర్, అలాగే హీరోయిన్ లేని లవ్ స్టోరీతో పాటు.. కేవలం 9 మంది క్యారెక్టర్లతో అడ్వంజరస్ సర్వైవల్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. ఈ త్రీ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించాడంటే 96 సీక్వెల్ లేదని తేల్చేస్తున్నారు తమిళ ఆడియన్స్. గతంలో ఈ ప్రాజెక్టులో మక్కల్ సెల్వన్ ప్లేసులో మరో హీరోను తెచ్చారన్న వార్తలను ఖండించిన ప్రేమ్ కుమార్. రీసెంట్ రూమర్లపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version