Dhanush: తమిళనాడు నెక్స్ట్ సీఎం రేసులోకి ధనుష్? దళపతి విజయ్ బాటలోనే ఆ స్టార్ హీరో !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ (Dhanush) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆయన అభిమాన సంఘం (All India Dhanush Fans Welfare Association) తాజాగా ఆవిష్కరించిన ఒక అధికారిక జెండా ఇటు సినీ వర్గాల్లో, అటు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ పరిణామంతో ధనుష్ కూడా త్వరలోనే సీఎం, దళపతి విజయ్ లాగా ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపిస్తున్నారు. దీని వెనుక ఎరుపు, తెలుపు రంగుల కలయికతో రూపొందించిన జెండా ఉంది. ఈ సరికొత్త డిజైన్ సాధారణ సామాజిక సేవా సంఘాల గుర్తుల కంటే పూర్తి రాజకీయ శైలిని కలిగి ఉండటంతో అందరి చూపు దీనిపైనే పడింది. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో నటుడు దళపతి విజయ్ (TVK పార్టీ) సృష్టించిన సంచలన విజయం తర్వాత, ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నెట్వర్క్ కూడా అదే దారిలో నడుస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయ్ కూడా మొదట తన అభిమాన సంఘాల ద్వారానే క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుని, ఆ తర్వాతే పార్టీని ప్రకటించారు. ధనుష్ కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ హడావిడి అంతా ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. దీనిపై ధనుష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా? లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!