Rajni – Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా

Kollywood

Kollywood

కోలీవుడ్ దిగ్గజ నటులు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సినిమాల విషయంలో తమ ప్రాధాన్యతల్ని మార్చేసుకుంటున్నారు. రజనీ 173 విషయంలో దర్శకులెందరో మారారు. సుందరి సి ఫస్ట్ కథ చెబితే ఓకే అయ్యింది. ఫైనల్ స్టేజ్ కు వచ్చేసరికి నో చెప్పాడు తలైవర్. సిబి చక్రవర్తి సెట్ అయ్యాడు అనుకుంటే.. భారీ స్కేల్ అదీ ఇది అంటూ కహానీలు చెప్పి తప్పించేశారు. చివరకు అశ్వత్ మారిముత్తు కొత్త కథతో రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ధర్మన్ గా తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూడా తన 237 ప్రాజెక్ట్ ఇలాగే మార్పులు సంతరించుకోబోతుంది.

థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కమల్ హాసన్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్‌కు డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఈ మూవీ ఎనౌన్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని రీసెంట్లీ వెల్లడించాడు ఉళగ నాయగన్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని తెలుస్తోంది. కొన్ని టెక్నీకల్ ఇష్యూస్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అవుతుందట. దీంతో టైమ్ వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో మరో దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. చిన్నా ఫేమ్ ఎస్ యు అరుణ్ కుమార్ చెప్పిన కథకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్. గత ఏడాది వీర ధీర శూరన్‌తో ఓకే అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఉళగనాయగన్‌తో కొలబరేషన్‌కు రెడీ అయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‪లో జరుగుతుందట. త్వరలో పట్టాలెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం కమల్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటు నిర్మాతగా వరుస చిత్రాలకు కమిట్ అయ్యాడు. కల్కి2తో పాటు రజనీతో మల్టీస్టారర్ మూవీ చేస్తుండగా సియోన్, ధర్మన్ చిత్రాలను నిర్మిస్తున్నాడు.