Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi Jackpot: మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందించడమే కాకుండా.. ఆర్థికంగానూ ఊహించని స్థాయిలో కలిసొచ్చిందనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజకు ఈ చిత్ర నిర్మాతలు సుమారు రూ.8 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు నైజాం రైట్స్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు నైజాం థియేట్రికల్ హక్కుల విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆ రైట్స్ వ్యాల్యూ భారీగా పెరిగింది. దీంతో ఫస్ట్ నార్మల్ డీల్‌గా కనిపించిన ఈ ఒప్పందం ఇప్పుడు రవితేజకు పెద్ద మొత్తంలో లాభాన్ని తెచ్చిపెట్టే డీల్‌గా మారిందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు నైజాం ఏరియాలో సినిమా సుమారు రూ.53.76 కోట్ల షేర్ (GSTతో కలిపి) సాధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఫుల్ రన్లో ఈ మొత్తం దాదాపు రూ.60 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా. GST మినహాయించిన తర్వాత షేర్ సుమారు రూ.50.95 కోట్లకు చేరుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇందులో సుమారు రూ.1.10 కోట్ల ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్‌కు 5 శాతం కమిషన్‌గా దాదాపు రూ.2.55 కోట్లు తీసివేస్తే.. మాస్ మహారాజకి నైజాం నుంచి సుమారు రూ.47.5 కోట్ల వరకు మిగిలే అవకాశం ఉందని అంచనా. కన్జర్వేటివ్గా రూ.45 కోట్లుగా తీసుకున్నా.. ఇది ఆయనకు భారీ మొత్తమే అని అంటున్నారు. నార్మల్‌గా ఈ సినిమాకు రవితేజకు కంప్లీట్ రెమ్యునరేషన్‌గా సుమారు రూ.25 కోట్లు ఇచ్చినా డీల్ పూర్తయ్యేదనే అంచనాలు ఉన్నాయి. కానీ నైజాం రైట్స్ తన రెమ్యునరేషన్లో భాగంగా తీసుకోవడం వల్ల సినిమా ఊహించని బాక్ల్ బస్టర్ సాధించడంతో ఆయనకు వచ్చే మొత్తం మరింత పెరిగిందని అంటున్నారు. కొన్ని ట్రేడ్ రిపోర్టులు ఈ మొత్తం రూ.50 కోట్లకు పైగానే ఉండొచ్చని పేర్కొంటున్నాయి. అంటే.. ‘ఇరుముడి’ సక్సెస్ రవితేజ కెరీర్‌కు కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా, ఆర్థికంగానూ భారీ జాక్‌పాట్‌గా మారిందన్నమాట అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రెమ్యునరేషన్, వాటా లెక్కలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు బయటికి రాలేదు.
Also Read
తాజావార్తలు
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!