Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం పంచుకున్న అధికారిక పోస్టర్ ఆధారంగా, ఈ సినిమా తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135 కోట్లకు పైగా గ్రాస్ (135 CR+ 1st Week Gross Worldwide) వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ ‘హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్’గా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
సరికొత్త పోస్టర్లో రవితేజ లుంగీ కట్టుకుని, ఆరుబయట తలపై నుంచి బిందెతో నీళ్లు పోసుకుంటూ స్నానం చేస్తున్న లుక్ సినిమాలోని నేటివిటీని, ఆయన క్యారెక్టరైజేషన్ డెప్త్‌ను స్పష్టంగా చూపిస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన మాస్ స్టామినా ఏంటో ‘ఇరుముడి’తో రవితేజ మరోసారి నిరూపించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు శివ నిర్వాణ టేకింగ్, విలక్షణమైన కథాంశానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్ర ఘనవిజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!