Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Interesting Update On Pawan Kalyans Hari Hara Veeramallu

రాబిన్ హుడ్ తరహాలో ‘వీరమల్లు’

Published Date :April 14, 2021 , 2:23 pm
By Prakash
రాబిన్ హుడ్ తరహాలో ‘వీరమల్లు’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ కాదు… జనసేనాని కూడా… అందువల్ల ఆచితూచి అడుగేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటున్నారు… క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలోనూ జనానికి మేలు చేసే పాత్రలోనే జనసేనాని కనిపించనున్నాడట… పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’… పీరియడ్ మూవీస్ అంటే డైరెక్టర్ క్రిష్ కు ప్రాణం… ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాడు క్రిష్… ఇప్పుడు పవన్ ను ‘హరి హర వీరమల్లు’గా చూపించి, అదే మ్యాజిక్ చేయబోతున్నాడు. ఇందులో ఉన్నవారిని దోచి, పేదవారికి పంచే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడట… ఇలాంటి కథలు వినగానే మనకు ఇంగ్లిష్ ఫోక్లోర్ హీరో రాబిన్ హుడ్ గుర్తుకు రాకమానడు… ధనవంతులను దోచుకొని, పేదలకు పంచే పాత్రగా రాబిన్ హుడ్ జనం మదిలో నిలచి పోయాడు… రాబిన్ హుడ్ 14వ శతాబ్దానికి చెందినవాడిగా రచయితలు చిత్రీకరించారు… క్రిష్ తన కథలో వీరమల్లును 17వ శతాబ్దానికి చెందినవాడిగా చూపిస్తున్నట్టు సమాచారం… ఇందులోనూ మన దేశం వచ్చిన విదేశీయులను వీరమల్లు ముప్పుతిప్పలు పెట్టే సన్నివేశాలు ఉన్నాయట!

రాబిన్ హుడ్ ఆ నాటి ఇంగ్లిష్ షరీఫ్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు… అలాగే ‘హరి హర వీరమల్లు’లో హీరో పాత్ర మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో నాటి అన్యాయాలను ఎదిరిస్తూ సాగుతుందట… ఔరంగజేబు 49 ఏళ్ళు పాలన సాగించాడు… అతని పరిపాలన సమయంలోనే విదేశీయులు పాశ్చాత్యులు మన దేశంలో తొలి అడుగులు వేశారు… ఆ రోజుల్లో ఎంతోమది పేదలకు అన్యాయం జరిగింది… దానిని ఎదిరించి, వీరమల్లు ఎలా జనం మదిని గెలుచుకున్నాడన్నదే ‘హరి హర వీరమల్లు’ కథ గా తెలుస్తోంది… జనసేనాని పవన్ ఇలాంటి కథల్లో నటిస్తే జనానికి మరింత చేరువ అవుతాడనీ అభిమానుల విశ్వాసం… అభిమానులు కోరుకొనే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని సమాచారం.. ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ ‘హరి హర వీరమల్లు’ చిత్రం రాబోయే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనం ముందు నిలవనుంది… మరి రాబిన్ హుడ్ ను తలపించే వీరమల్లు ఏ రీతిన ఆకట్టుకుంటాడో చూడాలి.

Also Read

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
  • Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
  • P. Bharat Bhushan: ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hari Hara Veeramallu
  • Krish
  • pawan kalyan

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్‌ రింగు రోడ్డు పనులు..!

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions