చిత్రపరిశ్రమలో ఒక హీరోకి అనుకున్న కథ మరో హీరోతో తెరకెక్కడం వంటి సంఘటనలు ఎప్పటినుంచో వింటున్నవే. తాజాగా అటువంటి సంఘటనలు రెండు పునరావృతం అయ్యాయి. బన్నీకి అనుకున్న సినిమా రామ్ చేతిలోకి… రామ్ కోసం రెడీ చేసిన కథ వరుణ్ ఆకౌంట్ కి వచ్చి చేరాయి. రీసెంట్ గా వరుణ్ తేజ్ కు కథ చెప్పి ఒప్పించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కథ నచ్చి వరుణ్ తేజ్ ఓకే చెప్పాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వచ్చే ఏడాది అది సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే ఈ కథ గతంలో హీరో రామ్ కోసం ప్రవీణ్ సత్తారు రెడీ చేసిందే. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఆ సంగతి అలా ఉంటే… రీసెంట్ గా రామ్ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. లింగుసామి దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతున్నాడు. నిజానికి ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడు లింగుస్వామి. ప్రకటన కూడా వచ్చిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో రామ్ తో సినిమా చేస్తున్నాడు లింగుస్వామి. ఇలా బన్నీ కోసం అనుకున్న సినిమా రామ్ కి… రామ్ తీ తీయాల్సిన సినిమా వరుణ్ తేజ్ కి బదిలీ అయ్యాయన్న మాట. మరి ఈ రెండింటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి.