ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో “రాపో 19” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ద్విభాషా చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందట. రామ్ కోసం డైరెక్టర్ లింగుసామి ఆసక్తికర కథనాన్ని సిద్ధం చేశారట. అదేంటంటే… “రాపో 19” ఫ్యాక్షనిజం నేపథ్యంతో అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది అంటున్నారు. కక్ష బ్యాక్‌డ్రాప్‌తో ఫుల్-ఆన్ కమర్షియల్ గా నిర్మితమయ్యే ఈ చిత్రంలో నటించడానికి రామ్ కూడా ఉత్సాహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కథతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు లింగుసామి ఇప్పుడు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.