Indraja: వినూత్న పాత్రలో సీనియర్ నటి ఇంద్రజ!
- మరోసారి వినూత్న పాత్రలో ఇంద్రజ
- రాణి భవాని దేవి పాత్రలో ఇంద్రజ
- స్వాతంత్ర కాలం నాటి కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ మరోసారి వినూత్న పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఎన్నో అద్భుత పాత్రలు చేసిన ఆమె.. ఈసారి రాణి భవాని దేవి పాత్రలో ఆకట్టుకోనున్నారు. ‘విప్లవ వీరుడు’ సినిమాలో ఇంద్రజ భవాని దేవి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో జైశ్వర్, సోనాలి జంటగా నటిస్తున్నారు. నాగరాజ్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏవీ జయరాం నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో విప్లవ వీరుడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.
ఇంద్రజ మాట్లాడుతూ… ‘స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నాం. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి.. స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవాని దేవి పాత్రలో కనిపించబోతున్నా. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే ఈ సినిమా కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా చేస్తున్నారు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని అన్నారు.
Also Read
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
- Peddi: హోంశాఖకు షాక్: 'పెద్ది' టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
- NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
Also Read: BCCI Recruitment 2026: 10 కోచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం!
హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ… ‘నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని అన్నారు. హీరో జైశ్వర్ మాట్లాడుతూ… ‘విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. ఇది సినిమా చరిత్రలో నిలిచిపోతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ‘టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారనే పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది’ అని నిర్మాత ఏవీ జయరాం చెప్పారు.
తాజావార్తలు
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!