Site icon NTV Telugu

Bollywood : ఇండో-పాక్ వార్.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా

Bollywood (2)

Bollywood (2)

ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది.  చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. ఛావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2  పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా ఫెయిలయ్యింది. ఇక రైడ్ 2ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక డల్‌గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావ్ కళ తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్ చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది.

Also Read : Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు

శ్రీకాంత్, స్త్రీ2 సినిమాలతో భారీ సక్సెస్‌ అందుకున్న రాజ్ కుమార్ రావ్ నుండి వస్తోన్న మూవీ కావడంతో భుల్ చుక్ మాఫ్‌పై అంచనాలున్నాయి. అందులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్స్ నిర్మించడంతో సినిమాపై వేరే లెవల్ ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10నే రావాల్సిన ఈ సినిమా జాట్ తో పోటీ నుండి తప్పుకుంది. మే 9న రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా   అమ్ముడయ్యాయి. థియేటర్ల కేటాయింపులు జరిగాయి. ఇక రిలీజ్ కావడమే తరువాయి అనుకుంటున్న టైంలో సడెన్లీ మేకర్స్ బయ్యర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని, ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు బాంబ్ పేల్చారు. వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తోన్న భూల్ చుక్ మాఫ్.. థియేటర్ల నుండి క్విట్ అయ్యి.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 16న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.  డిస్ట్రిబ్యూటర్స్ కూడా మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చే సినిమాలను బ్యాన్ చేయాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి సినిమా రిలీజ్ రద్దు పెద్ద నిర్మాణ సంస్థను చిక్కుల్లో నెట్టేసేట్లే కనిపిస్తోంది.

Exit mobile version