Site icon NTV Telugu

Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు

Thug Life

Thug Life

పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. కమల్ హాసన్, శింబు మీడియాతో ముచ్చటిస్తూ ఈ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.

Also Read : Akkineni : నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఫిక్స్.?

కాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసారు. కానీ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఈ నెల 16న జరగాల్సిన తగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కరెక్ట్ కాదని భావించి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. త్వరలో మరో డేట్ ను ప్రకటిస్తాం అని తెలిపారు. తమిళ్ స్టార్ నటీనటులు శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ కీ రోల్స్ చేస్తున్న థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాను కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version