NTV Telugu Site icon

AamirKhan : నా నటన బాగోలేదు.. అందుకే సినిమా పోయింది.. తప్పు నాదే..

Untitled Design (14)

Untitled Design (14)

ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు భాద్యత హీరోలు ఏ మాత్రం తీసుకోరు. మొత్తం నేరాన్ని దర్శకుడుపైనే నెట్టేస్తారు. ఆ దర్శకుడు తమ మా వినలేదు కథ మార్చమంటే మార్చలేదు అని రాకరాకాల కారణాలు చెప్తారు. ఇటువంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలానే చూసాం. ఆ మధ్య వచ్చిన ఓ సీనియర్ టాప్ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అవడంతో నేరాన్ని పూర్తిగా దర్శకుడిపైనే వేశారు.

Also Read: Release clash: రజినీకాంత్ vs సూర్య.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే..?

కానీ బాలీవుడ్ టాప్ ఖాన్స్ లో ఒకరు అమీర్ ఖాన్. 3 ఇడియట్స్, పీకే, ధూమ్, దంగల్ వంటి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఈ హీరో కెరీర్ లో ఉన్నాయి. ఇక అమీర్ ఖాన్ చివరిగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచుకుంది.  180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా రూ. 100 కోట్లకు పైగానే నష్టాలు మిగిల్చింది. అయితే ఈ చిత్ర ఫెయిల్యూర్ గురించి రెహచక్రవర్తి ఇంటర్వ్యూ లో అమీర్ మాట్లాడుతూ ” లాల్ సింగ్ చద్దాలో నా పెర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది. నాకు పర్సనల్ గా లాల్ సింగ్ చాలా ఇష్టం, కానీ ఈ సినిమాలో నా నటన ఓవర్ అయినట్టు అనిపించింది, అందుకే ప్రజలు దానితో కనెక్ట్ కాలేదు. ఈ ఫెయిల్యూర్ కు పూర్తి భాద్యత నాదే, రాబోయే ‘సితార జమీర్ పర్’ అందరికి నచ్చేవిధంగా ఉంటుంది”  అని అన్నారు. ఫెయిల్యూర్ సినిమాను కూడా తన భాద్యతగా ఒప్పుకున్న అమీర్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.