Site icon NTV Telugu

Ileana: ఏంటి.. ఇలియానా రెండో బిడ్డకు జ‌న్మనిచ్చిందా.. !

Actress Ileana

Actress Ileana

గోవా బ్యూటీ ఇలియానా అందం, అభిన‌యం గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది..ఇత‌ను పోర్చ్‌గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అత‌నితో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి తర్వాత ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇక ఇటీవల ఆమె రెండోసారి కూడా తల్లి కాబోతోందని వార్తలు ప్రచారం కాగా..

Also Read : Vijay -Rashmika: మరోసారి కలిసి కనిపించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా !

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త డోలన్ పసివాడిని ముద్దాడుతున్న ఫోటోను ఇలియానా షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ బిడ్డ కొత్తగా పుట్టినట్టుగా కనిపించడంతో నెటిజన్లు ‘ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా ఆ బిడ్డ ఆడా..? మగా..? అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్‌గానే ఉంచారు. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె ‘దో ఔర్ దో ప్యార్’ అనే హిందీ చిత్రంలో కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ‘రైడ్ 2’ వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉండే ఇలియానా.. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి!

Exit mobile version