Kollywood : రానున్న రెండు సినిమాలు హిట్ అవ్వకుంటే ఆ నిర్మాత అంతే సంగతులు
- తమిళ్ లో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్
- రెండు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన ke జ్ఞానవేల్ రాజా
- త్వరలో విడుదల కానున్న తంగలాన్ - కంగువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది.
విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా తమిళ్ తో పాటు పాన్ ఇండియా బాషలలో విడుదల కానుంది. ఇక మరొక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’.శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయలతో తీరికెక్కింది. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కంగువ రెండు భాగాలుగా రానున్నట్టు దర్శకుడు శివ ఇటీవల తెలిపాడు. మరోవైపు టాలివుడ్ హీరో అల్లు శిరీష్ హీరోగా రానున్న బడ్డీ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. అనుకోని కారణాల వలనఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా ఆగస్టు 2న విడుదల కానుంది బడ్డీ. ఈ మూడు చిత్రాల రిజల్ట్స్టూడియో గ్రీన్ కు చాలా కీలకం. ఏమాత్రం అటుఇటు అయినా జ్ఞానవేల్ రాజాకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
Also Read : Dhanush: బిచ్చగాడిగా అపర కుబేరుడు..మ్యాటర్ ఏంటంటే..?
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!