గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్. ఈ చిత్రం 2021 మార్చి 19 నుండి థియేటర్లలో విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి ‘యూ’ సర్టిఫికెట్ లభించినట్టు తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ పై తల అజిత్ కుమార్ ప్రశంసలు కురిపించారు.