iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iBomma Ravi: పైరసీ నేరాల కేసులో ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి. విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చే రవి, కేవలం తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్‌తో దొరికిపోవడం గమనార్హం. తెలుగు సినీ నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ఇచ్చిన పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా, సైబర్ క్రైమ్ పోలీసులు రవిపై గట్టి నిఘా ఉంచారు. రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట పలు డొమైన్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. రవి తరచుగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి, తన స్నేహితుడితో కలిసి పార్టీలు చేసుకుంటాడని గుర్తించారు. దీంతో, రవి హైదరాబాద్ వస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆ స్నేహితుడికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అతని మీద ఫోకస్ పెట్టారు.
Read Also: Gujju Wood : బడ్జెట్ రూ. 50 లక్షలు.. కలెక్షన్స్ రూ.75 కోట్లతో అబ్బుర పరుస్తున్న గుజరాతీ మూవీస్..
Also Read
ఇటీవల రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే, తన స్నేహితుడికి వాట్సాప్‌లోనో లేక అలాంటి ఒక మెసేజింగ్ యాప్‌లో ఒక సందేశం పంపాడు “మామా హైదరాబాద్ వచ్చా.. కలుద్దాం” అంటూ రవి పంపిన మెసేజ్‌తో అతను హైదరాబాద్‌లో ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, రవిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వైపు పైరసీ నేరం, మరోవైపు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా వందల కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, కేవలం ఒక సాధారణ మెసేజ్ కారణంగా పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!