Site icon NTV Telugu

iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్?

Ibomma

Ibomma

iBomma Ravi: పైరసీ నేరాల కేసులో ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి. విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చే రవి, కేవలం తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్‌తో దొరికిపోవడం గమనార్హం. తెలుగు సినీ నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ఇచ్చిన పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా, సైబర్ క్రైమ్ పోలీసులు రవిపై గట్టి నిఘా ఉంచారు. రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట పలు డొమైన్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. రవి తరచుగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి, తన స్నేహితుడితో కలిసి పార్టీలు చేసుకుంటాడని గుర్తించారు. దీంతో, రవి హైదరాబాద్ వస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆ స్నేహితుడికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అతని మీద ఫోకస్ పెట్టారు.

Read Also: Gujju Wood : బడ్జెట్ రూ. 50 లక్షలు.. కలెక్షన్స్ రూ.75 కోట్లతో అబ్బుర పరుస్తున్న గుజరాతీ మూవీస్..

ఇటీవల రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే, తన స్నేహితుడికి వాట్సాప్‌లోనో లేక అలాంటి ఒక మెసేజింగ్ యాప్‌లో ఒక సందేశం పంపాడు “మామా హైదరాబాద్ వచ్చా.. కలుద్దాం” అంటూ రవి పంపిన మెసేజ్‌తో అతను హైదరాబాద్‌లో ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, రవిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వైపు పైరసీ నేరం, మరోవైపు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా వందల కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, కేవలం ఒక సాధారణ మెసేజ్ కారణంగా పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది.

Exit mobile version