సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2 తో సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్చ్ చేస్తున్నారు.
Also Read : Dulquer Salmaan : నిర్మాతగా ఆ సినిమాలో నేను పెట్టిన డబ్బు మొత్తం పోతుందనుకున్నాను
అయితే ఈ సినిమాపై అంచనాలు.. బజ్ గురించి చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తమిళ మీడియాతో నెల్సన్ మాట్లాడూతూ ‘ జైలర్ 2 సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండండి. రజనీ మ్యాజిక్ ఏంటో వెండితెరపై చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటి నుండే సినిమాపై అంచనాలను పెంచకుండా ఉండటానికి, భారీ ప్రకటనలు, ఎలివేషన్స్ నేను ఇష్టపడను అలాగే మా టీమ్ కు అదే చెప్పను. రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కోసం అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసి ఒకవేళ రిలీజ్ అయ్యాక సినిమా ఆ అంచనాలకు అందుకుకోకుంటే, ఆడియెన్స్ ఒకే మాటలో ‘వేస్ట్’ అని అంటారు. అలా అనిపించుకోవడం కంటే వారి అంచనాలు పెంచకుండా ఉండడమే బెటర్’ అని అన్నాడు. జైలర్ సినిమాను ఎలివేషన్స్ మాస్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి నెల్సన్ భారీ హిట్ కొట్టడమే కాదు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. దాంతో ఇప్పుడు జైలర్ 2 తమిళనాడు మోస్ట్ హైప్ సినిమాగా మారింది.
