Site icon NTV Telugu

ఆ హీరోయిన్ అంటే.. అదో మాదిరి ఇష్టం: వైష్ణవ్​ తేజ్

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు, ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా పూర్తి చేశాడు. త్వరలోనే గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కానుంది. అయితే తాజాగా వైష్ణవ్​ తేజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ‘క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. తన ఫేవరేట్ క్రికెటర్ ధోని అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల్లో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని తెలిపాడు. హీరోయిన్స్ లో నజ్రియా నజీమ్ అంటే చాలా ఇష్టమన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని.. ఆయన నటించిన బద్రి, తమ్ముడు, ఖుషి సినిమాలంటే చాలా ఇష్టమని ముచ్చటించాడు.

Exit mobile version