NTV Telugu Site icon

Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!

Game Changer

Game Changer

చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ యాక్షన్‌తో కూడిన ఈ సోషల్ డ్రామా సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర IAS అధికారిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఆ అధికారి పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈమధ్య బాగా సెన్సేషనల్ అయిన తెలంగాణ హైడ్రాను సినిమాలో వాడుకున్నారట.

Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!

గేమ్ ఛేంజర్‌లో సంచలనాత్మక హైడ్రా ఎపిసోడ్‌ను టీమ్ షూట్ చేసింది. రామ్ చరణ్ నిజాయితీగల ప్రభుత్వ అధికారి పాత్రలో నటించగా ఆయన ఆధ్వర్యంలో జరిగే కూల్చివేత ఎపిసోడ్స్ షూట్ చేశారని అంటున్నారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించడానికి ముందే ఈ ఎపిసోడ్‌లను గత సంవత్సరం చిత్రీకరించినట్టు చెబుతున్నా పలువురికి అయితే అనుమానం ఉండనే ఉంది. ఈ ఎపిసోడ్‌ గేమ్ ఛేంజర్ హైలైట్‌లలో ఒకటిగా చెబుతన్నారు. ఈ ఎపిసోడ్‌లో రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకుల పేర్లు లేవు కానీ బాగా పేలేలా దీన్ని సిద్ధం చేశారని అంటున్నారు. గేమ్ ఛేంజర్‌లో ఎస్‌జె సూర్య ప్రధాన విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments