బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై ‘వార్ 2’ గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే.. ‘క్రిష్ 4’కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 రూ.700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మదిరిగిపోయే వసూళ్లను చూపించి.. సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్‌ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతున్నాయి.
క్రిష్ 4 తెరకెక్కేందుకు ఇంకా టైం పట్టే నేపథ్యంలో ఇతర సినిమాలకు కమిటౌతున్నాడు హృతిక్ రోషన్. తన పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ క్రియేట్ చేసి స్టార్మ్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో సినిమాను సెట్ చేసుకుంది హోంబలే. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసి ఆరు నెలలు కూడా దాటిపోయింది. కానీ కొత్త అప్డేట్ లేదు. హృతిక్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ డీల్ చేయబోతున్నాడన్న బజ్ ఆ మధ్య నడిచింది.
Also Read: Spirit First Look: ఇంకొన్ని గంటల్లో భారీ విధ్వంసం.. చేతిలో సిగార్, షర్ట్‌లెస్‌గా ప్రభాస్?
ప్రజెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న హృతిక్ డేట్స్ కోసం మరో బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అప్రోచ్ కాబోతున్నాడట. ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ తర్వాత డాన్ 3 నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నాడు. ఇప్పుడు గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్‌ను తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ ఛాయిస్ అని ఫర్హాన్ అక్తర్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై హీరోతో చర్చించినట్లు బీటౌన్ టాక్. మరి డాన్‌గా ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై అమితాబ్, షారూఖ్‌ను చూసిన ఆడియన్స్.. నెక్ట్స్ హృతిక్‌ను చూడబోతున్నారా?.
