Rajinikanth: రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య రావడంతో పొట్ట కింది భాగంలో వాపు వచ్చింది, దీంతో రజనీని ఆస్పత్రిలో చేర్చారు. ఇందుకోసం ఆయన కడుపులో స్టెంట్ అమర్చారని, స్టెంట్ అమర్చిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వస్తున్నాయి. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్‌ను ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. రజనీకాంత్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సెక్యూర్డ్ వాతావరణంలో వెళ్లాలి.
Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
Also Read
రజనీకాంత్‌కి ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరగడంతో.. చాలా త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. రజనీకాంత్‌ను రెండు మూడు రోజుల పాటు వైద్యులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తి శారీరక పరీక్షలు నిర్వహించి, 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా.. ఈ సమాచారాన్ని వైద్యులు ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్ కూడా నటిస్తున్నారు. కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రజనీ ఆరోగ్యం కుదుటపడే వరకు షూటింగ్‌లో పాల్గొనడం లేదని అంటున్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!