Site icon NTV Telugu

Serial Actor Chandu : నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప షాకింగ్ వ్యాఖ్యలు..

Whatsapp Image 2024 05 18 At 9.35.36 Am

Whatsapp Image 2024 05 18 At 9.35.36 Am

Serial Actor Chandu : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.రీసెంట్ గా “త్రినయని” సీరియల్‌ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.చంద్రకాంత్ ఆత్మహత్యతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయారం మరణానికి, చందు ఆత్మహత్యకి ఏదో లింక్‌ ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరో షాకింగ్‌ విషయం బయటకు వస్తుంది. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్స్ లో ఉన్నట్లు సమాచారం.దీనితో పవిత్ర మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో ఆ డిప్రెషన్‌ తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. అయితే నటుడు చందు గురించి ఆయన భార్య శిల్ప షాకింగ్ విషయాలు తెలిపింది.

చందుకు నాకు 2015 లో వివాహం అయింది.మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము.స్కూల్ డేస్ వయసు నుండి ప్రేమించమంటూ 3 ఏళ్లు వెంటపడ్డాడు.నేను ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నాము.పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాము.మాకు ఇద్దరు పిల్లలు..మేము ఎంతో అన్యోన్యంగా వున్నాము.పవిత్ర ఎప్పుడైతే మా లైఫ్ లోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి మా మధ్య గ్యాప్ స్టార్ట్ అయ్యింది.చందు నేను 4 ఏళ్ల క్రితం నుండి దూరంగా ఉంటున్నాము.నా పిల్లలతోనే చందు కాంటాక్ట్ లో ఉండేవాడు. చందు మారి ఇంటికి వస్తాడు అనుకున్నాము కానీ రాలేదు.నిన్న ఉదయం కాల్ చేసి మాట్లాడాను ఇంటికి వచ్చేయాలని బ్రతిమాలాడాను కానీ అంతలోనే సూసైడ్ చేసుకున్నాడు అని ఆమె తెలిపింది.

Exit mobile version