AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు

Aashu Reddy

Aashu Reddy

బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి పెళ్లి పేరుతో తన రూ. 9.5 కోట్లు డబ్బు తీసుకుని మోసం చేసిందని ఎన్నారై ధర్మేంద్ర కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తనపై లేనిపోని అభియోగాలు చేస్తున్నారని  హై కోర్టు లో ఆశు రెడ్డి పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది.  మీడియాలో తన గురించి కథనాలు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరింది. ఇంజెక్షన్ ఆర్డర్ కోసం మళ్ళీ హై కోర్టును ఆశ్రయించడంతో  అషురెడ్డి సివిల్ కోర్టు లో మెరిట్స్ పై విచారణ జరిగే వరకు ఆమె పరువు కు భంగం కలిగించే కథనాలు వద్దని హై కోర్టు వెల్లడించింది.

అయితే తనపై నమోదైన కేసులో దర్యాప్తును నిలిపివేయాలని మరో పిటిషన్‌ను దాఖలు చేసింది అషురెడ్డి. ఒక ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో నగదు మరియు విలువైన బహుమతులు తీసుకుని మోసం చేశారని అషురెడ్డి మరియు ఆమె తల్లి యశోదరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో తమపై దర్యాప్తును నిలిపివేయాలని కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ దశలో దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా పోలీసుల విచారణ సజావుగా సాగాలని తెలిపింది. దాంతో పాటు కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అషురెడ్డి అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో పోలీసులు చట్టప్రకారం తమ దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని కోర్టు అభిప్రాయపడింది. చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సిందేనని స్పష్టం చేయడంతో అషురెడ్డి ఆమె తల్లి ఇప్పుడు పోలీసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అషురెడ్డికి పెద్ద ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని దోషిగా తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.