NTV Telugu Site icon

Sneha : ఆమె మార్చన్నిది నన్ను ఒక్కడినే..

Sneha

Sneha

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌ల్లో స్నేహ‌ ఒకరు. 2000 నుంచి 2020 వరకు హీరోయన్‌గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త‌న అందం, అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకునేది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు 2012 మే 11న ప్రస‌న్న అనే న‌టుడిని వివాహం చేసుకుంది. తమిళ సినిమా షూటింగ్‌లో కలుసుకున్న వీరు, ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజంట్ స్నేహా మంచి పాత్రాలు ఎంచుకుంటు దూసుకుపోతున్నప్పటికి, ప్రసన్న విలన్ గా పలు చిత్రాలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరు చాలా యాడ్స్ లో కూడా కలిసి నటించారు. అయితే రీసెంట్ గా ప్రసన్న స్నేహా పైన వైరల్ కామెంట్స్ చేశాడు.

Also Read: Akhil : రాయలసీమ నేపథ్యంలో అక్కినేని అఖిల్‌..

ఈ జంట తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఇందులో స్నేహాకి ఓసీడీ ఉంద‌ని తెలిపింది. దానికి వెంట‌నే రియాక్ట్ అయిన స్నేహ భ‌ర్త ప్రస‌న్న.. ఇల్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటైర్ వేశాడు. అప్పుడు స్నేహ స్పందిస్తూ.. అవును నాకు ఇల్లు ఎప్పుడు శుభ్రం గా ఉండాలి. కిచెన్ క్లీన్ లేక‌పోతే అస్సలు ఊరుకోను. ఈ ఓసీడీ స‌మ‌స్య అరుదైన‌దే అయిన అంత‌గా భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు’ అంటూ స్నేహ చెప్పగా ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.