Site icon NTV Telugu

Nara Rohit Political Entry: పొలిటికల్‌ ఎంట్రీపై నారా రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. మనల్ని ఎవడ్రా ఆపేది..?

Nara Rohith

Nara Rohith

Nara Rohit Political Entry: సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన తారలు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు.. రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా వివిధ స్థాయిల్లో పనిచేసినవారు ఉన్నారు.. మాకొద్దు బాబోయ్ ఈ రాజకీయాలు అనేవారు ఉన్నారు.. అయితే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్… మొత్తంగా ఓ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది..

Read Also: Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన నారా రోహిత్.. రాజకీయాల్లోకి వస్తే చెప్తానని అన్నారు… పెదనాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్నయ్య నారా లోకేష్.. ఇలా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని అన్నారు . ఈ నెల 27వ తేదీన నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది.. నారా రోహిత్ హీరోగా, ప్రతివాఘవి, శ్రీదేవి హీరోయిన్లుగా సంతోష్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్, హీరోయిన్లు ప్రతివాఘవి, రుక్మిణి సినిమా ఫ్రేం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. పాత సుందరకాండ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉందన్నారు.. సుందరకాండ సినిమాలు రెండు ఒకటి కాదు ట్యాగ్ లైన్ గా పెట్టామని వివరించారు. ఇది కుటుంబ కథ చిత్రమని, ఎంటర్టైన్మెంట్
లవ్ స్టోరీతో కూడుకున్నదని అంటున్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రొడ్యూసర్ సంతోష్, హీరోయిన్ ప్రతివాఘవి, శ్రీదేవి మాట్లాడుతూ.. సుందరకాండ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సినిమాలో ప్రతి నటుడు మంచి రోల్ ఉందని పేర్కొంది చిత్ర యూనిట్..

Exit mobile version