NTV Telugu Site icon

Nara Rohith: మీది కూడా ‘మూలా నక్షత్రమా’.. అయితే సుందరకాండ చూడాల్సిందే..

Untitled Design (18)

Untitled Design (18)

హీరో నారా రోహిత్ సినీ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం సుందరకాండతో నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌న రిలీజ్ ఈవెంట్ ను బంజారాహిల్స్ లోని PVR RK సినీప్లెక్స్ లో విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్.

Also Read: Dhoom: ధనాధన్ ‘ధూమ్ – 4’ వచ్చేస్తోంది.. ఈసారి విలన్ ఎవరంటే..?

నారా రోహిత్ సిద్ధార్థ్ అనే పెళ్లి కానీ ఒంటరి వ్యక్తి పాత్రను పోషించాడు, అతను సాధారణ వివాహ వయస్సు దాటినప్పటికీ, తన ఐదు కండిషన్స్ కు ఒప్పుకునే  అమ్మాయి కోసం వెతికే పనిలో ఎదుర్కొన్న ఇబ్బందులను కామిక్ వే లో చూపించారు. మూలా నక్షత్ర జాతకం కలిగిన వాడు 5నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆనందంగా ఉండలేడు వంటి సంభాషణలు బాగా పేలాయి. తన క్యారెక్టరైజేషన్ మరియు కామిక్ టైమింగ్‌తో హాస్యాన్ని అందించే నారా రోహిత్‌కి ఈ పాత్ర టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని సరసన వృతి వాఘని కథానాయిక. ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు, సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రిగా కనిపించారు. వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో చూపినట్లుగా, ప్రతి వ్యక్తికి రిలేట్‌గా ఉండే కథాంశంతో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు.సెప్టెంబరు 6న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.