Priyadarshi : జాతకం చెప్పబోతున్న ప్రియదర్శి.. మీ పెళ్లి ఎప్పుడో తెలుసుకోండి..
- హీరోగా వరుస సినిమాలు చేస్తున్న ప్రియదర్శి
- నేడు దర్శి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
- ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న దర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
Also Read: Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..?
Also Read
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో రానుంది ఈ చిత్రం” అని అన్నారు.
చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ” మా సంస్థలో 15వ చిత్రమిది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’, ‘యశోద’ – హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!