ఆసక్తికరంగా “వసంత కోకిల” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ టాలెంటెడ్ నటుడు సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం “వసంత ముల్లై”. ఇందులో సింహా సరసన కాశ్మీర పర్దేషి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ మురుగేసన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఎస్ఆర్టి ఎంటెర్టైన్మెంట్స్, ముద్ర యొక్క ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో “వసంత ముల్లై”గా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తెలుగులో “వసంత కోకిల”గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : అజిత్ ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అప్పుడేనా?
Also Read
“వసంత కోకిల” టీజర్ చూస్తుంటే… అందులో ఓ ప్రేమ జంట అనుకోని భయంకర పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు కన్పిస్తోంది. తెలియని వ్యక్తి నుండి ఈ జంటకు ముప్పు పొంచి ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే అది ఎవరు ? కథ ఏమై ఉంటుందనే విషయాన్ని మాత్రం టీజర్ లో రివీల్ చేయకుండా సస్పెన్స్ లోనే ఉంచారు మేకర్స్. కానీ టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మీరు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ “వసంత కోకిల” టీజర్ పై ఓ లుక్కేయండి.
- Tags
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?