గంధీ బాత్ :
ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ ‘ఆల్ట్ బాలాజీ’ అడల్ట్ వెబ్ సిరీస్! నగరాల్లో, ఊళ్లలో జరిగే ఘాటైన శృంగార కథలే ఈ హాట్ సిరీస్ కి పెట్టుబడి!
ఫ సే ఫ్యాంటసీ :
‘వూట్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సెగలుగక్కుతోంది ఈ సెక్సీ సీరిస్! టైటిల్ లోనే ఫ్యాంటసీ ఉందిగా… ఇంక చెప్పేదేముంది? తొమ్మిది ఎపిసోడ్స్ లో తొమ్మిది రకాల ఫ్యాంటసీలు గాల్లో తేల్చేస్తాయి…
రస్ భరీ :
సాధారణంగా హాట్ కంటెంట్ వెబ్ సిరీసుల్లో పేరున్న యాక్టర్స్ కనిపించరు. కానీ, ‘రస్ భరీ’లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ స్వర భాస్కర్ సర్వం చూపించినంత పని చేసింది. టీచర్ గా ఆమె చేసిన నటన రొమాంటిక్ ఆన్ లైన్ విద్యార్థుల మదులు దోచేసింది. అయితే, స్వర స్కిన్ షో హాట్ గానే ఉన్నప్పటికీ ఈ సిరీస్ లో కథని పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు…
హలో మినీ :
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న నాటీ వెబ్ సిరీస్ ‘హలో మినీ’. కేవలం అడల్ట్ కంటెంటే కాకుండా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కూడా ఉండటంతో ఇది పాజిటివ్ రివ్యూస్ పొందింది. చివరి షాట్ దాకా ఆడియన్స్ ని ఆకట్టుకోవటం ‘హలో మినీ’కి హైలైట్ గా చెప్పుకోవాలి…
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ :
అమేజాన్ లో అందుబాటులో ఉన్న ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అడల్ట్ వెబ్ సిరిస్ కాదు. అయినా కూడా పక్కన పిల్లల్ని కూర్చోబెట్టుకుని లివింగ్ రూంలో చూసేది కూడా కాదు. నలుగురు ఇండియన్ గాళ్స్ తమదైన రీతిలో జీవితాల్ని గడుపుతుంటారు. అందువల్ల అనివార్యంగా అడల్ట్ కంటెంట్ తెర మీదకు వస్తుంటుంది. కాకపోతే, మంచి మెసేజ్ అండ్ క్రియేటివిటితో తీసిన వెబ్ సిరీస్ ‘ఫోర్ట్ మోర్ షాట్స్ ప్లీజ్’…
వర్జిన్ భాస్కర్ :
‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతోంది ‘వర్జిన్ భాస్కర్’. పేరులోనే అర్థమవుతోందిగా… ఇది ఓ ‘వర్జిన్’ అబ్బాయి కథ. కానీ, మనోడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండానే ఎన్నో ఎరోటిక్ నావల్స్ రాసేస్తాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ, ‘వర్జిన్ భాస్కర్’ రొమాంటిక్ రైటర్ గా సక్సెస్ అయ్యి రియల్ లైఫ్ రొమాన్స్ లో వెనుకబడిపోతాడు! ఈ వింత కథే ‘వర్జిన్ భాస్కర్’ సిరీస్ సమ్మరీ…