NTV Telugu Site icon

HCU Land Issue : హెచ్ సి యు లో జరుగుతున్న ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ

Hcu, Anchor Rashmi

Hcu, Anchor Rashmi

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ‌కి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాల భూమిపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించిన సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ విషయంపై స్పందించగా తాజాగా తేలుగు బుల్లితెర యాంకర్ రష్మీ కూడా స్పందించింది.

Also Read: Puri Jagannadh: విజయ్ సేతుపతి పై ఫుల్ ఫైర్ అవుతున్న తమిళ ఆడియన్స్..

‘నేను రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై వ్యతిరేకంగా ఈ వీడియో నేను చేయటం లేదు, ఎక్కడ ఎవ్వరికి నేను వ్యతిరేకం కూడా కాదు. HCU జరుగుతున్న ఘటన అందరికీ తెలిసిందే. నేనున్న ఈ అపార్ట్మెంట్ లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కూడా ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగింపబడ్డాయో నాకు కూడా తెలుసు. కానీ అక్కడ జరుగుతున్నది చూస్తే పక్షులు నెమళ్ళు చాలా సఫర్ అవుతున్నాయి. రాబోయేది అత్యంత వేసవికాలం. అందులో పక్షులు నెమళ్ళు జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాటి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. జంతువులను రీహబిలైట్ చేయాలి.ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ఈ విషయం పై మీరు పాజిటివ్ స్టెప్ తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది.