కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి దూరంగా విదేశాలో సెటిల్ అయిపోయింది. అలా లండన్‌లో సచిన్ సగ్గర్‌ను వివాహం చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిల్ అయ్యింది. తిరిగి ఇప్పుడు టాలీవుడ్‌లో ‘మజాక’ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది అన్షు.
Also Read:Priyanka Chopra: వర్జినిటీ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు: ప్రియాంక చోప్రా
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘మజాకా’.హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. ఇందులో రావు రమేష్ కు జంటగా అన్షు కనిపించబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం జోరుగా ప్రమొషన్ లు చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ రోజు ‘మజాకా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి అన్షు ఫ్యామిలి తో సహ అటెండ్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.